కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు జిల్లాలు అర్హులైన గిరిజనులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో దర్తీ అభ జన జాతీయ గ్రామీణ ఉత్పక్ష అభియాన్ లో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని వెలిగించి శిక్షణ ప్రారంభించారు.