వెంకటేశ్వరపురంలో వైఎస్ఆర్సిపి 53 వ డివిజన్ ఇన్ చార్జ్ వెంగల్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై Mla అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నమ్మన్నారు. కావ్య కృష్ణారెడ్డి ఒక ఎమ్మెల్యే గా ఉండి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అవహేళన పరిచేలా మాట్లాడడం చూస్తుంటే కావ్య కృష్ణారెడ్డి సంస్కారం ఏపాటిదో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు.