యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు .పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.