ప్రకాశం జిల్లా తాళ్లూరులోని హౌసింగ్ లేఅవుట్లను బీసీ కార్పొరేషన్ పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు కావలసిన అన్ని వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించి అనుకున్న వ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఎంపీడీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.