ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో శుక్రవారం గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గిద్దలూరు పట్టణంలో రాత్రి 10:30 వరకు గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తూ ప్రజలు హోరెత్తించారు. యువత డిజే పాటలకు తమ అభిమాన హీరో పాటలకు స్టెప్పులు వేస్తూ రంగులు చల్లుకుంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. గిద్దలూరు పట్టణంలో దాదాపు 20 విగ్రహాలకు గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువత పోరెత్తించారు.