రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సకాలంలో ఎరువులు కూటమి ప్రభుత్వం అందించలేదని వైకాపా శ్రేణులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో... శనివారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామంలో ఎరువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు లేకుండా కేవలం స్థానిక టిడిపి నాయకులు ఎరువులు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి కి చెందిన రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది... అనంతరం టిడిపికి చెందిన స్థానిక నేతలపై వైకాపాక వర్గీయులు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.