నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బండారు చంద్రం ఏకగ్రీవంగా ఎన్నిక నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షులుగా బండారు చంద్రం, ఉపాధ్యక్షులుగా బైండ్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా దుబాసి సంజీవ్, కోశాధికారిగా స్వామి, కార్యవర్గ సభ్యులుగా వంగాల రంగాచారి, కుందన ఎల్లం, రామస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.