పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వెళ్లే ప్రధాన రహదారిలో మద్యం మత్తులో కారు నడిపాడు. ర్యాష్ డ్రైవింగ్ తో సిటీ షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లాడు. వెంటనే తీరుకొని కారును రివర్స్ తీసి పరారీ అయ్యాడు. ఈ గట్టునకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. షాపింగ్ మాల్ యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.