భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని దేవి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు బిఎంఎస్ ఇంచార్జ్ అప్పాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక పోరాట సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు పని చేస్తున్న యూనియన్ బిజెపి అనుబంద బి ఎం ఎస్ యూనియన్ అని, సింగరేణిని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని, కార్మికులకు లాభాల వాటా 40 శాతం చెల్లించేలా కృషి చేస్తామని,కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.