తూఫ్రాన్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న మందుల గదికి వెళ్లి నిల్వ ఉన్న వివిధ రకాల మందులను పరిశీలించారు. ఎన్ని నెలలకు మందుల సరఫరా జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న టీకాల గదిలోకి వెళ్ళి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పలు వ్యాక్సిన్లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని క్యాబోరేటరీ, ఇంజెక్షన్, డ్రెస్సింగ్ రూమ్, ప్రసూతి గది, ఇన్ పేషెంట్ గదులను పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతయని, గత నెలలో ఎన్ని జరిగాయని అడిగి తెలుసుకున్నారు.