పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, మార్కొండ పుట్టి గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు శుక్రవారం శక్తి టీం సభ్యులు డ్రగ్స్ వినియోగం వలన వనగోరే అనర్ధాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటు సెల్ఫోన్ వినియోగం సైబర్ క్రైమ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. మహిళా రక్షణ చట్టాలు పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐఎల్ శ్రీనివాసరావు, ఉమెన్ పి సి నిర్మల తదితరులు పాల్గొన్నారు.