కామారెడ్డి జిల్లా కేంద్రానికి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో రూట్ మ్యాప్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పరిశీలించారు. కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షంతో నష్టపోయిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అలాగే వరద బాధితులను సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. ముంపుకు గురి అయినా బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అనంతరం జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ల నుంచి ఎల్లారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు.