కాకినాడలో నగదు రహితంగా పలు రకాల కాయనులతో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలరాజు నగర్ లోని ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు ఇంటిలిజెన్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 8,560 ల నగదు, 204 కాయిన్లు,18 ఫోన్ లను స్వాధీనపరుచున్నారు. ఇక ఈ కేసులో నిందితులను బ్యాంకు ఖాతాదేవలకు సంబంధించిన లావాదేవీలు కూడా పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు.