గత కొన్నేళ్ళ క్రితం జిల్లాలోని చేబ్రోలులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్, హత్య కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నిందితుడును అదుపులోకి తీసుకొని, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా కృషి చేశారని హత్యకు గురైన మైనర్ బాలిక తండ్రి దావీదు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్వర న్యాయానికి స్పందనగా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.