ఉయ్యూరులోని కాటూరు రోడ్డు సర్వీస్ రోడ్డు చిన్నపాటి వర్షానికే చెరువులా మారింది. రోడ్డు పొడవునా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. వ్యాపారస్తులు చెత్తను, డ్రైనేజీ నీటిని రోడ్డుపై వేయడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.