ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్ రాజమండ్రిలోని లక్ష్మీ వారపుపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ మీడియం పాఠశాలను సోమవారం ఉదయం సందర్శించారు. రాజమండ్రి వచ్చిన ఆయన పాఠశాలను సందర్శించి తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.