జిల్లావ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని అనుకుంట సమీపంలో గల జైనథ్ మహాత్మా జ్యోతి బాఫూలే గురుకుల విద్యాలయం విద్యార్థినులు బొజ్జ గణపయ్య ఆకారంలో ఆసనం వేసి ఆకట్టుకున్నారు. గణనాథుడి పాటపై వారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మధ్యమాలలో వైరల్ గా మారాయి.