Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 24, 2025
గోదావరి నదిలో నీటిమట్టం పెరిగి ప్రమాదకరంగా మారడంతో చేపల వేట తాత్కాలికంగా నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వీఆర్ పురం, చింతూరు మండల ప్రాంతాల్లో ఎవరూ నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. దేవీపట్నం మండలంలో కూడా గోదావరి నదిలోకి పడవలపై ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని ఎస్సై షరీఫ్ ఆదివారం సూచించారు. ఎవరైనా హెచ్చరికలు లెక్క చేయకుండా వెళ్తే చర్యలు ఉంటాయని తెలిపారు.