కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట ఘాట్ రోడ్డుపై ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గురువారం రాత్రి రేకుర్తి గుట్టపై కనిపించిందని..తరుచు ఇదే ప్రాంతంలో తిరుగుతుందని స్థానికులు తెలిపారు. గత నెలలో కూడ ఆహరం కోసం రేకుర్తి శివారు లోని పలు కాలనీలో తిరుగుతుందని శాతవాహన హీల్స్, మైత్రి వనం, షేబాబి కాలనీ, సింహద్రి కాలనీ, స్వామి కాలనీలో ఎలుగుబంటి తిరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ ఎలుగుబంటి ఎవరిపై ఎలాంటి దాడి చేయలేదని స్థానికులు తెలిపారు. అయితే ఇలాంటి వన్య మృగాలతో ఎప్పటికైనా ప్రమాదమే అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.