శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పనులను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సాయంత్రం పరిశీలించారు. జి.జి.హెచ్ వద్ద నుండి బ్రాడిపేట - అరండల్ పేట వరకు జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఆర్.ఓ.బి పనుల వలన ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురు అవుతుందని దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి కావడానికి అవసరమగు చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్.ఓ.బి పనులు రూ.98 కోట్లతో 930 మీటర్లు పొడవున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పనులు సకాలంలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ట్రాఫిక్ అంతరాయం త్వరితగతిన పరిష్కారం కావడానికి దోహదం అవుతుందని చెప్పారు.