ప్రభుత్వ ఐటీఐ స్థలంలో వీణల కోసం నిర్మించిన భవనంలో రిసార్ట్స్ పెడితే అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి శ్రావణ్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐ స్థలంలో భవనాలను నిర్మించారని, ఆ భవనాల్లో వీణల పెట్టకుండా ప్రైవేట్ వ్యాపారులకు రిసార్ట్స్ కోసం లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. ఐటీఐ పక్కన రిసార్ట్స్ పెడితే పోరాటం చేస్తామన్నారు.