Download Now Banner

This browser does not support the video element.

భారత్ ఎగుమతులు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలకు నిరసిస్తూ వామపక్ష పార్టీల నేతల ఆందోళన

Anantapur Urban, Anantapur | Sep 6, 2025
భారత్ ఎగుమతులు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలని నిరసిస్తూ అనంతపురంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. టవర్ క్లాక్ వద్ద నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అమెరికా కోర్టులే స్వయానా ఈ విధానాలు తప్పు అంటూ పునరాలోచించాలని ట్రంప్ కు హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. భారత విదేశాంగ వ్యవహారాలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ విధానాలను ఎండగట్టేలా భారత ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగించి ట్రంప్ విధానాలను రద్దుపరిచేలా చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us