ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టారని ఈరోజు ఒక చారిత్రాత్మక దినమని అన్నారు. గత పదిహేళ్లుగా ఏ ముఖ్యమంత్రి యూనివర్సిటీలో అడుగు పెట్టలేదని ఓయూను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీ సమస్యలను పట్టించుకోలేదని ఆయన తెలిపారు.