ఆసిఫాబాద్ జిల్లా పోలీసు పరిధిలో గణేష్ నవరాత్రి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు లక్కీ డ్రా, లాటరీలు, బహుమతి పథకాలు వంటి నిర్వహించరాదన్నారు. లక్కీ డ్రాలో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్కీ లాటరీలు,లక్కీ డ్రా లు నిషేధం ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.