నెల్లూరులోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఎప్పటి లోపు పనులు పూర్తవుతాయో అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా పూర్తి చేయాలన్నారు. చెప్పిన టైం కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి ఆదేశించారు.