ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి తదితర సమస్యలు తెలుపుతూ వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే గారు సమస్యల గురించి సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.