పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల - నడికుడి జంక్షన్ అడ్డాగా బుధవారం తెల్లవారుజామున అగంతుకులు సిగ్నల్ టెంపర్ చేసి నరసాపూర్ ఎక్స్ప్ర్పెస్ లో దోపిడీకి పాల్పడ్డారు. ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3 భోగిలలో ప్రయాణికుల వద్ద నుండి బంగారు అభరణాలు చోరీ చేసి పరారయ్యారు. కాగా నడికుడి రైల్వే బ్రిడ్జి వద్ద ఇది వరుసగా మూడవ చోరీ సంఘటన. జూన్ 29న పిడుగురాళ్లలో రెండుసార్లు రైల్లో దోపిడీకి దొంగలు తెగబడ్డారు. వరుస చోరీలు జరుగుతున్నప్పటికీ అధికారులు దంగతనాలను అరికట్టలేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.