గుత్తి పట్టణానికి చెందిన శ్రీకాంత్, లక్ష్మీ కళావతి దంపతుల కుమార్తె చైత్రిక శ్రీ (7) ని విషపురుగు కాటు వేసింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇంటి బయట మంచంపై కూర్చున్న సమయంలో విషపురుగు చైత్రిక శ్రీని కరిచింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం చేశారు. ఆరు గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.