గంగవరం పోర్టు పొల్యూషన్ నుండి గాజువాక ప్రజలను రక్షించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గాజువాక వై జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ పోర్టు పొల్యూషన్ వలన ప్రజలు ఉక్కిరిపిక్ అవుతున్నారని వై జంక్షన్ నుండి పోర్ట్ రోడ్ లో ఎన్ని నివాసాలు ఉన్నాయని వారిని ఏమాత్రం పట్టించుకోకుండా రమణా లారీలు పైన ఇటువంటి తార్పాలు వేయకుండా రవాణా కొనసాగిస్తున్నారని ఎన్నిసార్లు గంగవరం పోర్టు యాజమాన్యానికి చెప్పిన ఉపయోగం ఉండటం లేదని అన్నారు. పోర్టు పొల్యూషన్ వలన చుట్టుపక్క గ్రామాల్లో నిరసన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.