Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
ఇద్దరు రేషన్ మాఫియా ముఠాల మధ్య వివాదం... అధికారుల వైఫల్యం వెరసి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న వైనం వెలుగులోకి వస్తుంది. వివరాల మేరకు... నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాసిలి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 120 రేషన్ బియ్యం బస్తాలు.. ఒక వాహన స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సంగం మండలం సిద్దిపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాలు రేషన్ బియ్యం బస్తాలను వాహనంతో పాటు పట్టుకున్నారు. వారం రోజుల వ్యవధిలో 6 చోట్ల దాడులు చేసి వందల కొద్ది రేషన్ బియ్యం బస్తాలు, పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చ