శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతులకుంటలోని గ్రామ కంఠంలో ఉన్న కాలువను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని గ్రామస్తుడు చిదంబరరెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో ఆయన కలెక్టర్ చేతన్కు వినతి పత్రం ఇచ్చారు. కాలువ కింద 42 ఎకరాల ఆయకట్టు భూమి కలదని, కాలువ కబ్జా చేయడంతో సాగునీరుకు ఇబ్బందిగా ఉందన్నారు. కాలువలో కబ్జాదారులు ఇంటి నిర్మాణం చేపడుతున్నారని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.