ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్.. చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలతో 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రినైనా పదవిలో నుంచి తీసివేసే బిల్లును కేంద్రం పార్లమెంట్ లో బుధవారం ప్రవేశపెట్టిందన్నారు.