మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలు ఎక్కే ప్రయాణికులు కరువాయాలని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని ఆటో డ్రైవర్లు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు లేక వెలవెలబోతున్న ఆటోలను చూపిస్తూ ప్రభుత్వం కనికరించాలని కోరారు. రానున్న రోజుల్లో ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల విషయంలో ఆలోచించి తమకు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలన్నారు.