సూర్యాపేటలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని, బీసీలు ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఉద్యమించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.