నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నంద్యాల మూడవ ఫ్లాట్ఫామ్ వద్ద గూడ్స్ రైలు కింద పడి మంగళవారం రాత్రి ఒంటి గంటకు ఆత్మహత్య చేసుకున్నాడనీ "రైల్వే ఎస్సై కుమారి" తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి మోహన్ బాబు యూనివర్సిటీలో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడన్నారు. కాలేజీ ఫీజు కట్టమని తండ్రి డబ్బులు పంపగా.. జగదీశ్వర్ రెడ్డి కాలేజీ ఫీజు కట్టలేదు. ఈ విషయం కళాశాల యాజమాన్యం తండ్రికి తెలిపింది. ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణం అయి ఉండవచ్చని తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.