కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవములు కన్నుల పండుగగా సాగుతున్నాయి.ఇందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ వాసవి గణేష్ ఉత్సవ సేవా కమిటీ ఆధ్వర్యంలో నాలుగో రోజు గణేశునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ పురాణం సందీప్ శర్మ ఆధ్వర్యంలో పారాయణము, మండపం నుండి పూలతో ఊరేగింపు, అనంతరం మహిళలు పాల్గొని సంపెంగ పూలు, చామంతి, చిట్టి రోజాలు మల్లెపూలు, రోజా పూలు,గులాబీలు, కాగడాల పూలు, చెండు మల్లె పూలతో పుష్పయాగ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.