కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంపరిధిలోని మైలవరం మండలం మైలవరం జలాశయం కార్య నిర్వాహక ఇంజనీర్ రమేష్ శనివారం పలు విషయాలు ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై అధికారుల ఉత్తర్వుల మేరకు మైలవరం డ్యాం స్పిల్వే గేట్ల నుండి నీటి ప్రవాహాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 10 వేల క్యూసెక్యుల నుండి 5వేల క్యూసెక్కులకి అంచలంచలుగా తగ్గించడం అయినదన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి నది తీర ప్రాంతాలకు ఎవరూ రావద్దని పదేపదే హెచ్చరికలు జారీ చేయడమైనదని తెలిపారు.