Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
ఉదయగిరి మండల పరిధిలోని దాసరపల్లి హైవే సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఉదయగిరి నుంచి స్వగ్రామానికి బైక్పై వెళుతుండగా ఒక్కసారిగా గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణరెడ్డి గాయం కావడంతో 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రి తరలించారు.