దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరన్నవరాత్రి వేళ అమ్మవారి ఆరాధనతో మనసుకు సమాజానికి శాంతి శక్తి లభిస్తాయి అని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆపద్బాంధవిగా పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో సుఖసంతోషాలు నెలకొన్నాలని అమ్మవారిని పార్థించినట్లు తెలిపారు.