ఏలూరు ఆశ్రం ఆసుపత్రి సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందారు. కాకినాడకు చెందిన కోటి సూర్యనారాయణ ఏలూరులో తన సోదరుడు చనిపోయాడని చూసేందుకు కాకినాడ నుంచి రైలులో ఏలూరు కు బయలుదేరాడు. సరిగ్గా రైలు ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆస్పత్రి వద్దకు వచ్చేసరికి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రైల్వే హెచ్ సి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.