కళ్యాణదుర్గం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం రాత్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలి వచ్చి ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ద్వాదశ హారతులు, మహా మంగళహారతి వంటి పూజలను నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.