కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి నికిత మాట్లాడుతూ అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అన్నారు సమస్య లేదురైనప్పుడు ధైర్యంగా సమిష్టిగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.