అనంతపురంలో జరిగిన సుపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వెళ్లిన టిడిపి కార్యకర్త అదృశ్యమయ్యాడు. బొమ్మనహల్ మండలంలోని కురువళ్ళి గ్రామానికి చెందిన నీలకంఠప్ప కుమారుడు టిడిపి కార్యకర్త దాసరి సురేష్ (40) బుధవారం ఉదయం స్థానిక టిడిపి నాయకులతో కలిసి కూటమి బహిరంగ సభ కు బస్సులో వెళ్లాడు. తిరిగి బస్సులో రాలేదు. వెంట వెళ్లిన మిగతావారు అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేసినా ఎటువంటి పలితం లేకపోయింది. గురువారం సాయంత్రం వరకూ కూడా అతని కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో వారు బొమ్మనహాల్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ పై పిర్యాదు చేశారు. సురేష్ ఆచూకీ తెలిస్తే 8073447021 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.