మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడం, పెండింగ్ చలానాలు, తదితరాలను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని, చలనాలు పెండింగ్ లేకుండా చెల్లించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించారు