తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిందన్నారు. ఐలమ్మ త్యాగాలను స్మరిస్తూ, ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మపేరిట...