కర్నూలు జిల్లావ్యాప్తంగా డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులు 2600 మంది ఉన్నారని నియామక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాధికారి ఎస్ శ్యామ్యూల్ పాల్ అన్నారు. ఆదివారం ఉదయం 12 గంటలు రాయలసీమ విశ్వవిద్యాలయం లోని డీఎస్సీ ధృవీకరణ పత్రాల కేంద్రాన్ని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు సంబంధించి 54 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకోసం 250మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై నియమించామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం వచ్చే ఏ అభ్యర్థి ఇబ్బందులు పడకుండా హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.