సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనీ అమావాస్య మహోత్సవాల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ తో కలిసి శనేశ్వరుడికి తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొని పూర్ణాహుతి కత్రువు పూర్తి చేశారు. దైవ కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర నందగిరి మహారాజులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు.