చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని తిరువనం పల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవే పనులు చేస్తూ ఉన్న మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, చిగరపల్లె గ్రామానికి చెందిన ప్రమీల (40) హైవే పనులు చేస్తూ ఉండగా, తిరుపతి నుంచి బెంగళూరు వైపు వేగంగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమీల అక్కడికక్కడే మరణించగా, మృతదేహం తీవ్రంగా దెబ్బతినడంతో రోడ్డుపై తునా తునకలై పడిపోయింది. సమాచారం అందుకున్న కాణిపాకం ఎస్సై నరసింహలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.