సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ గ్రామానికి చెందిన రాములు, సాయమ్మ ల కుమార్తె ప్రేమల (23) ను నిజాంపేట మండలంలోని దామర చెరువు గ్రామానికి చెందిన సంగమేష్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపారు. ఈ క్రమంలో వారికి ధనుష్ (3), సూర్యవంశీ ( 3నెలలు) ఇద్దరు కుమారులు జన్మించారు. ఈనెల 4వ తేదీన గురువారం ప్రేమలను ఆమె భర్త సంగమేశ్ దామరచెరువు గ్రామం నుండి నిజాంపేట్ గ్రామానికి తీసుకువచ్చి అత్తగారి ఇంటి వద్ద దించి వెళ్ళాడు. శుక్రవారం ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు.