సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు శనివారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈనెల 21 నుండి పాఠశాలలకు దసరా సెలవులు వస్తుండడంతో శనివారం జహీరాబాద్, న్యాల్కల్, మోగుడంపల్లి, జరా సంఘం మండలాల్లోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడి, పాటలు పాడుతూ సందడి చేశారు.